బోనాల పండుగ జాతరలో భాగంగా ఆదివారం రాత్రి రామంతపూర్ భరత్‌నగర్‌లో నివసిస్తున్న రామరాజు ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ ఊరేగింపులోకి అకస్మాత్తుగా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా కారును వేగంగా డ్రైవింగ్ చేస్తూ దూసుకువచ్చాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మధుసూదన్, పోలీసు సిబ్బంది కారును అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో తన కారునే అడ్డుకుంటారా అంటూ క్రాంతి అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. అదే సమయంలో తన అనుచరులతో వచ్చిన హబ్సిగూడ ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల చొక్కా పట్టుకొని దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఎస్‌ఐకి గాయాలయ్యాయి. తాగిన మైకంలో ఉన్న ఈ వీధిరౌడీలు సృష్టించిన బీభత్సంలో ఫలహార బండి ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన ప్రధాన వ్యక్తి అనిల్ బిఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఫలహార బండి నిర్వాహకులు రామరాజు, అనిల్, క్రాంతి మరికొంతమందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి తెలిపారు.