Saturday, July 26, 2025

ముంచిన గూగుల్ మ్యాప్స్‌.. వరదలో చిక్కుకున్న కారు

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే దాదాపు ప్రతీ ఒక్కరు గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో చెప్పే సూచనలు పాటిస్తూ గమ్యస్థానానికి చేరుకుంటారు. అయితే కొన్నిసార్లు గుడ్డిగా గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మడం కూడా కొంప ముంచుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ని ఫాలో అయి.. వేరే దారిలో వెళ్లి చిక్కుకుపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి ఘటనే కేరళలో (Kerala) ఓ జంటకు ఎదురైంది.

గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరించి కారుతో వరద ఆ జంట వరద నీటిలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా కేరళ (Kerala) కొట్టాయంలోని కడుతురుతిలో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. అదే సమయంలో జోసెఫ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. మ్యాప్ చూపిస్తున్న దారిలో వెళ్తుండగా.. ఒక చోట వరద నీటిలో చిక్కుకుపోయారు. కారు ముందు భాగం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు దంపతులను రక్షించారు. ఆ తర్వాత కారును నీటి నుంచి బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News