- Advertisement -
ఢిల్లీ: రోప్‌వే కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పంచమహల్ జిల్లాల్లో ఈ ప్రమాదం జరిగింది. పావగఢ్‌లో కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తున్న రోప్‌వే కూలిపోవడంతో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు సహా ఆరుగురు మరణించారు. ప్రసిద్ధ కాళికామాత ఆలయ శక్తిపీఠం ఉన్న పావగఢ్‌లోని కొండపై ఓ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ సమయంలో రోప్‌వేలో నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తున్న ట్రాలీ కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారని పంచమహల్ డిఎస్పీ హర్ష్ దుధాత్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -