Tuesday, July 1, 2025

విమానంలో అస్తికలు తీసుకెళ్లేందుకు అనుమతి

- Advertisement -
- Advertisement -

విమానంలో అస్తికలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని, అయితే అందుకు కొన్ని నియమాలు పాటించాలని ఇండిగో కార్గో యాజమాన్యం తెలిపింది. అయితే విమానంలో అస్తికలు తీసుకెళ్లేందుకు మరణ ధృవీకరణ పత్రం లేదా పోస్టు మార్టం రిపోర్టు, స్థానిక పోలీసు స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఒసి), గుర్తింపు పొందిన క్రిమేటర్ నుంచి క్రిమేషన్ సర్టిఫికెట్, మరణించిన వ్యక్తికి ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాధి నిర్థారిస్తూ డాక్టర్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని వివరించించి. అస్తికలను సురక్షితంగా ఫైబర్, కే వంటి తక్కువ బరువు ఉండే కలశంలో ఉంచాలని తెలిపింది. మెటల్ కలశాన్ని అనుమతించమని స్పష్టం చేసింది. కలశం తగిన జాగ్రత్తలు తీసుకుని బాక్స్‌లో లోపలి భాగంగా ప్యాకింగ్ చేయాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News