Sunday, July 27, 2025

ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బిఎన్‌ఎస్ 356(2), 353(బి), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ కార్పొరేటర్ కవిత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఆర్‌ఎస్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News