Friday, June 13, 2025

నటి కల్పికపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

సినీనటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమో దు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం 324(4), 352, 351(2) సెక్షన్ల కింద గ చ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిజం పబ్ లో బిల్ చెల్లించకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా కల్పిక ప్రవర్తించారు. ప్లే ట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫి ర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యా దు చేశారు. ప్రీజం పబ్బు యజమాని దీపక్ బజాజ్ కోర్టులో పిటీషన్ వేశారు. గచ్చిబౌలి పోలీసులు కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు.

మే,29వ తేదీన క్లబ్‌కు వెళ్లిన కల్పిన పుట్టిన రోజు సందర్భంగా పబ్బుకు వెళ్లింది, రూ.2,200 బిల్లు చేయగా, కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వాలని పబ్బు సిబ్బందిని కోరగా, కుదరదని మేనేజర్ చెప్పడంతో గొడవకు దిగింది. అక్కడికి వచ్చిన సిబ్బందిని భూతులు తిట్టడంతో అక్కడ ఉన్న వస్తువులు విసిరేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పబ్బు సిబ్బందిపై పలు ఆరోపణలు చేసింది. బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్‌లో జరిగిన గొడవను యాజమాన్యం రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News