Friday, August 1, 2025

విజయ్ సేతుపతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

- Advertisement -
- Advertisement -

తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా ఎక్స్ లో చేసిన ఈ ఆరోపణలు కోలీవుడ్ లో సంచలనంగా మారింది. డ్రగ్, కాస్టింగ్ కౌచ్ సంస్కృతిలో ఆయన భాగమని రమ్య మోహన్ అనే మహిళ సోషల్ మీడియాలో విజయ్ సేతుపతిపై ఆరోపణలు చేసింది. తనకు తెలిసిన ఒక అమ్మాయిని విజయ్ చాలా సంవత్సరాలుగా మానసికంగా, శారీరకంగా బాధించాడని.. దీంతో బాధితురాలిని డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆమె పేర్కొంది. అయితే, విజయ్ అభిమానులు ఆరోపణలు చేసిన మహిళపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. నేరస్థుడిని కాకుండా బాధితురాలిని ప్రజలు ఎలా లక్ష్యంగా చేసుకుంటారని రమ్య మోహన్ నిరాశను వ్యక్తం చేసింది. దుష్ప్రవర్తన ఆరోపణలు ఉన్నప్పటికీ సేతుపతి వంటి పురుషులను ప్రజలు, మీడియా ఆరాధిస్తున్నారని విమర్శించారు. తన స్నేహితురాలి గోప్యతను దృష్టిలో పెట్టుకుని ఆమె పరిస్థితిని మరింత దిగజార్చాలని తాను కోరుకోవడం లేదని.. తన పోస్ట్‌ను తొలగించింది.

ఈ ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలను ఆయన ఖండించారు. విజయ్ మాట్లాడుతూ.. “నేను తెలిసిన ఎవరైనా దీనిని చూసి నవ్వుతారు. ఈ రకమైన నీచమైన ఆరోపణలు నన్ను బాధించలేవు. నా కుటుంబం, సన్నిహితులు కలత చెందారు. కానీ, నేను వారికి.. ‘దాన్ని వదిలేయండి. గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోంది’ అని చెప్పాను. నేను ఏడు సంవత్సరాలుగా అన్ని రకాల అసత్య ప్రచారాలను ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు అవి నన్ను ప్రభావితం చేయలేదు..ఎప్పటికీ చేయవు. ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు తన బృందం ఫిర్యాదు చేసింది” అని పేర్కొన్నారు.

కాగా, విజయ్ సేతుపతి నటించిన మూవీ ‘తలైవన్ తలైవి’ టీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఇందులో విజయ్ సరసన నిత్యా మీనన్ నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News