మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంపై తొలి అడుగు పడ్డట్లు తెలుస్తోంది. శుక్రవారం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్, కోఠిలోని సిబిఐ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కా ళేశ్వరం అధికారులతో పలు అంశాలపై చర్చించడంతో పాటు, కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు సంబంధించిన నివేదికపై ఆరా తీ సినట్లు సమాచారం. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఏ) రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వ రం నివేదికపై సిబిఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కార్పొరేషన్., అంతరాష్ట్ర అంశాలపై విచారించాలని ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్ర మేయంపై విచారించాలని లేఖలో ప్రస్తావించింది. కాళేశ్వరం లో భారీగా అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టుల డిజైన్, నా ణ్యత లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇ చ్చిందని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రతినిధుతో పాటు ప్రాజెక్టులలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని సిబిఐకి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది.
ఎవరీ ప్రవీణ్ సూద్..?
ప్రవీణ్ సూద్ 1964లో హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఓం ప్రకాష్ సూద్ ఢిల్లీలో ఓ ప్రభుత్వ గుమాస్తాగా పనిచేసేవారు. ఆయన తల్లి కమలేష్ సూద్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రవీణ్ సూద్ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి అక్కడే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే ప్రవీణ్ సూద్ యూపీఎస్సీ (సివిల్స్) పరీక్షలో ర్యాంక్ సాధించారు. ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1989లో మైసూరులో తొలి పోస్టింగ్ పొందారు. 1999లో మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా మూడేళ్లు అక్కడే విధులు నిర్వర్తించారు.
ఆ తరువాత మైసూర్ పోలీస్ కమిషనర్ 2004 నుంచి 2007 వరకు పనిచేశారు. 2008, 2011లో బెంగళూరు కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంప్యూటర్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 2013 నుంచి 2014 వరకు కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగారు. అనంతరం కర్ణాటక హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆ రాష్ట్ర డిసిపిలతగా పనిచేశారు. 25 మే 2023న ప్రవీణ్ సూద్ సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు నూతన డైరెక్టర్‌గా నియమితులైయ్యారు. మరో రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. సుబోధ్ జైస్వాల్ తర్వాత దేశంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ కావడం విశేషం.