నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామగిరి పోలీసుల నుండి దర్యాప్తును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తన కుమారుడు గట్టు వామన్‌రావు, కోడలు పివి నాగమణి హత్యపై సిబిఐ విచారణ కోరుతూ గట్టు కిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం గత నెలలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు, వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపక్క కుమార్‌లపై భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 302 (హత్య) కింద రామగిరి పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను సిబిఐ తన సొంత కేసుగా తిరిగి నమోదు చేసింది. రాష్ట్ర పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను సిబిఐ తిరిగి నమోదు చేయడం ద్వారా కేసును సిబిఐ స్వాధీనం చేసుకుంది.
దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణల తో సరిపోలవచ్చు లేదా సరిపోకపోవచ్చు అనే విషయాలను సిబిఐ తుది నివేదిక రూపంలో కోర్టుకు సమర్పిస్తుంది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న వామనరావు దంపతు లను 2021వ సంత్సరం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం మంథని -పెద్దపల్లి హైవేపై హైదరా బాద్‌కు వెళుతుండగా వారి కార్లలోంచి బయటకు లాగి హతమర్చారు. తన కొడుకు, కోడలు కొంతమంది వ్యక్తులను బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ముందస్తు శత్రుత్వం కారణంగా వారు చంపబడ్డారని గట్టు కిషన్‌రావు తెలిపారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినందున కొత్త దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. మంథని పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తి కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కోర్టుకు లేఖ రాసిన తర్వాత పోలీసులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ గట్టు వామన్‌రావు,
నాగమణి 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో హైకోర్టును ఆశ్రయించారు. వామనరావు దంపతులు హైకోర్టుతో సహా వివిధ కోర్టులలో వివిధ ప్రజా సమస్యలపై పిల్‌లు కూడా దాఖలు పర్చారు. మరో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు న్యాయవాది దంపతుల వాహనాన్ని దారి మళ్లించి వారిపై దారుణంగా దాడి చేసి, పారిపోయారని పోలీసులు గతంలో వెల్లడించారు. .