- Advertisement -
మన తెలంగాణ/సంగెం: మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో సీసీ రోడ్డు వేసిన నెల రోజులు గడవకముందే పగుళ్లు వచ్చి, పెచ్చులు లేచిపోతున్నాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడడం, సరైన వాటర్ క్యూరింగ్ చెయ్యకపోవడం వల్లేనే రోడ్డు దెబ్బతింటున్నయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -