ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం సీలింగ్ ఫ్యాన్ ఊడి పడిన ఘటనలో పసికందుకు గాయాలయ్యాయి. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ శుక్రవారం స్థానిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాలింత, చిన్నారి ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఫీలింగ్ నుండి ఫ్యాన్ ఊడిపోయి బాలింత పడుకొన్న మంచంపై పడి తల్లి పొత్తిళ్లలో ఉన్న పసికందు తలకు తగిలి గాయమైంది. విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్స్ తిరుమల మండల వైద్యాధికారి శ్యాంసుందర్‌కు సమాచారం అందించగా ఆయన సూచన మేరకు పసికందును 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై మండల వైద్యాధికారి శ్యాంసుందర్‌ను వివరణ కోరగా రిమ్స్‌కు వెళ్లి పసికందు ఆరోగ్య పరిస్థితి పరిశీలించానని, పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఆసుపత్రిలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..పసికందుకు గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -