- Advertisement -
ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొంత అప్రమత్తంగా బాధితుడు వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… వృత్తిరీత్యా పెయింటర్ అయిన శ్రీనివాస్ తన వివో ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని బైక్‌పై వెళుతున్నాడు. అత్తాపూర్ వద్ద జేబులోని నుంచి పొగలు రావడం గమనించిన అతను వెంటనే బైక్ పక్కకు ఆపాడు. అప్పటికే భారీగా వేడెక్కిన సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతని ప్యాంటు జేబు కింది తోడ భాగం కాలిపోయింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తోడలోని మొదటి వరుస చర్మం పూర్తిగా కాలిపోగా, రెండవ లేయర్ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -