- Advertisement -
అమరావతి: అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. సిఎం చంద్రబాబుతో క్యూపిఐఎఐ సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ సమావేశం అయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో(Quantum Valley) క్యూపిఐఎఐ సంస్థ భాగస్వామ్యం అయ్యారు. విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సిఎం ఆదేశాలిచ్చారు. అధునాతన 8 క్యూబినేట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపిఐఎఐ సంస్థ ముందుకొచ్చిందని చంద్రబాబు తెలియజేశారు.
- Advertisement -