తదుపరి జనాభా లెక్కలతోపాటు కులపరమైన
జనగణన రాజకీయ వ్యవహారాల కేబినెట్
కమిటీ నిర్ణయం కులగణన కేంద్ర ప్రభుత్వ
పరిధిలోనిదే కొన్ని రాష్ట్రాలు రాజకీయ లబ్ధి కోసం
సర్వేలు నిర్వహించాయి కాంగ్రెస్, ఇండియా కూటమి దానిని
వాడుకుంటున్నాయి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆక్షేపణ
చెరకు సేకరణ ధర పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో కులగణనకు సంబంధిం చి కేంద్ర ప్రభు త్వం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. తదుపరి జాతీయ జనాభా లెక్కల సేకరణ లో భాగంగా కులగణనను కూడానిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారంనాడు సమావేశమైన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) సమావేశంలో నిర్ణయం జరిగింది. అనంత రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా గోష్ఠిలో మాట్లాడుతూ ‘రానున్న జనాభా లె క్కల సేకరణలో కుల గణనను చేర్చాలని సి సిపిఎ నిర్ణయించింది’ అని వెల్లడించారు. కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాయని ఆక్షేపించారు. విపక్షా లు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో రాజకీయ కారణాలు, లబ్ధి కోసం కులగణన పే రిట సర్వేలు నిర్వహించాయని వైష్ణవ్ విమర్శించారు. అయితే తాము మాత్రం తదుప రి జనాభా లెక్కల గణనలో కులగణను పా రదర్శకంగా నిర్వహించాలని సంకల్పించామని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై అశ్విని వైష్ణవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ కుల గణనను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇండియా కూటమి పార్టీలపై కూడా మం త్రి విరుచుకుపడుతూ, రాజకీయ ప్రయోజనం సాధించేందుకు మాత్రమే అవి కుల ఆధారిత జన గణనను ఉపయోగిస్తున్నాయ ని ఆరోపించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాలు కుల గణనను వ్యతిరేకించాయి. కుల గణ న అంశాన్ని క్యాబినెట్‌లో పరిశీలించాలని 2010లో దివంగత డాక్టర్ మన్మోహన్ సిం గ్ సూచించారు. ఆ అంశం పరిశీలనకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చా లా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫా ర్సు చేశాయి. అయినప్పటికీ, కుల సర్వే లే దా కుల గణన నిర్వహించరాదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది’ అని వైష్ణవ్ చె ప్పారు. ‘కాంగ్రెస్, దాని ఇండియా కూట మి భాగస్వామ్య పక్షాలు కుల గణను ఒక రాజకీయ సాధనంగానే వినియోగించాయన్నారు. కేంద్రం కుల గణనను ప్రకటించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా, ఇండియా కూటమి, కొన్ని ప్రాంతీయ పార్టీ లు దీర్ఘ కాలంగా కోరుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్నాటక సొం తంగా కుల సర్వే నిర్వహించాయి. 2023 అక్టోబర్‌లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో కూటమిలో ఉన్నప్పుడే కుల సర్వే విషయంలో ముందడుగు వేశారు. అయితే,అటువంటి డేటాను విడుదల చేసిన తొలి రాష్ట్రం బీహార్, ఆ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 36 శాతం మంది అత్యంత వె నుకబడిన తరగతుల (ఇబిసి)వారు కాగా, 27.1శాతం మం ది బిసిలు, 19.7 %మంది ఎస్‌సిలు, 1.7శాతం మంది ఎస్‌టిలు.
చెరకు ధర 4.41 శాతం పెంపు
అక్టోబర్‌లో మొదలయ్యే 202526 సీజన్ కోసం చెరకు న్యా యమైన, గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పి)ని 4.41 శాతం మేర, క్వింటాల్‌కు రూ. 355 స్థాయికి హెచ్చించాలని ప్రభుత్వం బు ధవారం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వ హించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో చెరకు రైతుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రకటన తెలియజేసింది. ప్రస్తుత 202425 సీజన్‌కు చెరకు ఎఫ్‌ఆర్‌పిని క్వింటాల్‌కు రూ. 340 మేరకు నిర్ధారించడమైంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడు తూ, మౌలిక రికవరీ రేట్ 10.25 శాతానికి సంబంధించి క్విం టాల్‌కు రూ. 355 ఎఫ్‌ఆర్‌పిని ఆమోదించినట్లు తెలిపారు. ‘202526 చక్కెర సీజన్ కోసం ఎఫ్‌ఆర్‌పి ప్రస్తుత 202425 సీజన్ కన్నా 4.41 శాతం అధికం’ అని ఆ ప్రకటన పేర్కొన్నది.
షిల్లాంగ్‌సిల్చార్ హైవే ప్రాజెక్టుకు ఆమోదం
మేఘాలయలోని మావ్‌లింగ్‌ఖుంగ్‌నుంచి అస్సాంలోని పంచ్‌గ్రామ్ వరకు 166.80 కిమీ గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్‌ను రూ. 22864 కోట్ల వ్యయంతోహైబ్రిడ్ ఏన్యుటీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం అంగీకారం తెలిపిం ది. అధికార ప్రకటన ప్రకారం, ప్రాజెక్టు నిడివి 166.80 కిమీ (ఎన్‌హెచ్6)లో మేఘాలయలో 144.80 కిమీ, అస్సాంలో 22 కిమీ భాగంగా ఉన్నాయి. ‘రూ. 22864కోట్ల మొత్తం వ్య యం తో హైబ్రిడ్ ఏన్యుటీ పద్ధతిలో మేఘాలయలోని మావ్‌లింగ్‌ఖుం గ్ (షిల్లాంగ్ సమీపాన) నుంచి అస్సాంలోని పంచ్‌గ్రామ్ (సిల్చార్‌సమీపాన) వరకు జాతీయ రహదారి 6లో 166.80 కిమీ మేర నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదన అని ఆ ప్రకటన తెలిపింది.