అనుమతులకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నో ప్రాజెక్టుపై అనేక
అభ్యంతరాలు వచ్చాయి జిడబ్లుడిటి తీర్పును పరిశీలించాల్సి ఉంది
పోలవరంబనకచర్ల లింక్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు చుక్కెదురు
నెగ్గిన తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం:
మంత్రి ఉత్తమ్ నిబంధనల ప్రకారమే కేంద్ర వ్యవహరిస్తుందనడానికి
ఇది ఉదాహరణ :బండి సంజయ్ నిపుణుల కమిటీ నిర్ణయాన్ని
స్వాగతిస్తున్నాం.. ప్రాజెక్టు నిలిపివేసే వరకు పోరాటం: హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలు నెగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కేం ద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిగణలోకి తీ సుకుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వచ్చాయని కేంద్ర పర్యావరణ ని పుణుల కమిటీ వెల్లడించింది. బనకచర్ల ప్రాజెక్టు కు అనుమతి ఇచ్చే ముందు గోదావరి వాటర్ డి స్పూట్ ట్రిబ్యునల్(జిడబ్లుడిటి)తీర్పును సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతు ఇ వ్వడానికి ముందు సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి)ని సంప్రదించాల్సి ఉంటుందని కమి టీ అభిప్రాయపడింది. బనకచర్ల ప్రాజెక్టుకు ఎ లాంటి అనుమతులు ఇవ్వరాదని కోరుతూ ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలుసుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో సోమవారం నాడు బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర ప ర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేయడం గ మనార్హం. గోదావరిపై ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండా ఏపి ప్రభుత్వం అక్రమంగా తలపెట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్(డిపిఆర్) ను అడ్డు కోవడంతో పాటు ప్రాజెక్టు టెండర్లను కూడా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ కు బహిరంగ లేఖ రాశారు. ఎపి ప్రభుత్వం చర్యలు గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఏపి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణాకు దక్కాల్సిన గోదావరి నదిజలాల వాటా హక్కును ప్రత్యక్షంగా దిక్కరించడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా తన వాదనలను కేంద్రం ముందు ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడే కారణం
బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వలేమని నిర్దంద్వంగా తోసిపుచ్చడం రాష్ట్ర ప్రభుత్వ విజయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఎపి ప్రభుత్వానికి షాక్ అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిడియే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. గోదావరిలో వరద జలాలను సమగ్రంగా లెక్కించాల్సిందేనని, సెంట్రల్ వాటర్ కమిషన్ తో సంప్రదింపులు జరిపి వరద జలాలను లెక్కలు తేల్చాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నది జలాల అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు ఉన్న నేపధ్యంలో అంతరాష్ట్ర సమస్యలను ముందుగా పరిష్కరించాలని ఆయన కోరారు.
సెంటిమెంట్ ను రగిలిచే యత్నం
బనకచర్ల ప్రాజెక్టుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. గోదావరి నదిలో వరద నీటి లభ్యత, అంతరాష్ట్ర అంశాల పరిశీలన తరువాతే కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. తాము మొదటి నుంచి చెప్పినదానికే కట్టుబడి ఉన్నామని, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.
మేము స్వాగతిస్తున్నాం
సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి), గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యూనల్(జిడబ్లూటి) పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ నీటి హక్కులకు కాపాడడంలో తాము ముందుంటామని ఆయన తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన వెల్లడించారు.