Monday, September 15, 2025

ఫైనల్‌లో సౌత్‌జోన్ చిత్తు.. దులీప్‌ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీని (Duleep Trophy) సెంట్రల్ జో్న్ కైవసం చేసుకుంది. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో సౌత్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రజత్ పటిదార్ తన నాయకత్వంలో కొన్ని నెలల వ్యవధిలో గెలిచిన రెండో టైటిల్ ఇది. ఐపిఎల్ 18వ ఎడిషన్‌లో రజత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయ తీరాలకు చేర్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్ (Duleep Trophy) విషయానికొస్తే.. మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బౌలింగ్ ఎంచుకోవడంతో సౌత్‌జోన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, సెంట్రల్ జోన్ బౌలింగ్ ముందు తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 511 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ జట్టు పుంజుకుంది. అయినప్పటికీ.. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. దీంతో కేవలం 65 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సెంట్రల్ జోన్.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన యశ్ రాథోడ్‌(194, 13 నాటౌట్)కి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది. సరాంశ్ జైన్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు.

Also Read : నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News