Friday, May 30, 2025

అన్నదాతలకు కేంద్రం శుభవార్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలానికి వరి ధాన్యం కనీస మద్దతు ధరను ౩ శాతం పెంచింది. వరిసహా 14రకాల పంటలకు ధరలను పెంచారు. పప్పు ధాన్యాల,చమురుగింజలమద్దతు ధరలను 9 శాతం మేర పెంచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవా రం జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ పెంపుదలకు అనుమతిని ఇచ్చారు. ప్రత్యేకించి దేశంలో వచ్చే పండుగ సీ జన్‌కు పప్పులు , వంటనూనె అవసరాలను పరిగణనలోకి తీసుకుని వీటికి కనీస మద్దతు ధరలపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమావేశం తరువా త కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. మద్దతు ధరల పెంపుదలతో ఇక ఈ 202526 ఖరీఫ్ సీజన్‌లో వ రి మద్దతు ధర మూడు శాతం అంటే క్వింటాలుకు రూ 69 చొప్పున పెరిగి ఇకపై ఇది క్వింటలుకు రూ 2369 అవుతుంది. కాగా చమురు , పప్పు ధాన్యాలకు తొమ్మిది శాతం ఎదుగుదలతో అన్ని రకాల పప్పు ధాన్యాలకు మద్దతు ధరలో గణనీయ పెరుగుదల ఉంటుందని మంత్రి వివరించారు. అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సుల మేరకు ఖరీఫ్ పంట మద్దతు ధరల పెంపుదలను ఖరారు చేశారు. ఈసారి నైరుతి రుతుపవనాలు  సాధారణం కన్నా ముందు రావడంతో , ఖరీఫ్ పంటలు వేయడానికి దేశంలో ఇప్పటికే సానుకూల వాతావరణం ఏర్పడింది. రైతలు అనేక ప్రాంతాలలో పంటలు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ దశలోనే కేంద్రం మద్దతు ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని , ఇది మోడీ ప్రభుత్వం రైతాంగ సంక్షేమ కోణంలో తీసుకున్న నిర్ణయం అని మంత్రి తెలిపారు. ఖరీఫ్ మద్దతు ధరల్లో పెంపుదల , ముందుగా నిర్ణయం, ఇదే దశలో సబ్సిడీ పద్ధతిలో రుణాల మంజూరీ సంబంధిత ఇంట్రెస్టు సబ్‌వెన్షన్ స్కీంలను కూడా వర్తింపచేస్తారని మంత్రి తెలిపారు. గత 11 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను గణనీయంగా పెంచిందని, వ్యవసాయ సాగు వ్యయాలు , ధరల కమిషన్ సిఫార్సులను ఆమోదించిందని మంత్రి చెప్పారు.

పెరిగిన మద్దతు ధరల వివరాలు ఇవే
పప్పు ధ్యాన్యాలు, వంటనూనెల ధాన్యాలపై దృష్టి
వరి సాధారణ , ఏ గ్రేడ్ రకాలకు పెంపుదలతో ఇప్పుడు కనీస మద్దతు క్వింటాలుకు రూ 2369 అయింది. ఇక తృణధాన్యాల విషయానికి వస్తే రాగులకు క్వింటాలుకు రూ 596 పెంచారు. దీనితో ఇకపై ధర రూ 4886 అవుతుంది. వరుసగా జొన్నలకు రూ 328 పెంపుదలతో క్వింటాలుకు రూ 3699 (హైబ్రిడ్ రకం) అవుతుంది. మల్దానీకి క్వింటాలుకు రూ 3749, మొక్కజొన్నకు క్వింటాలుకు రూ 175 పెంపుదలతో రూ 2400 అవుతుంది. బజ్రాకు రూ 150 పెరగగా ఇకపై ఇది క్వింటాలుకు రూ 2778 చేరుకుంది. పప్పు ధాన్యాల ధరలను క్వింటాలుకు పెంచిన ధర 6.9 శాతం. ఇక చమురు ధాన్యాల ధరలను ఇప్పుడు 9 శాతం మేర పెంచారు. కందిపప్పు మద్దతు ధరను క్వింటాలుకు రూ 480 పెంచగా , ఇప్పుడు వీటికి కనీస మద్దతు ధర రూ 8000 అవుతుంది. ఇక మినప ధరను క్వింటాలుకు రూ 400 చొప్పున పెంచగా ఇది ఇప్పుడు రూ 7400 పలుకుతుంది. పెసర పప్పు క్వింటాలుకు రూ 86పెరగగా , ఇక దీని ధర రూ 7721 గా ఖరారు అయింది. నువ్వులకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 579 పెంచారు.

ఇది ఇకపై రూ 9846 అవుతుంది. పల్లీల ధరను రూ 480 పెంచగా ఇకపై ఇది రూ 7263 అవుతుంది. సోయాబీన్ పెరుగుదల రూ 436 ఇకపై ఇది రూ 5329 అవుతుంది, పొద్దు తిరుగుడు ధరను క్వింటాలుకు రూ 441 పెంచారు. ఇక ఇది ఇకపై రూ 7721 అవుతుంది. ఇక వాణిజ్య పంటల విషయానికి వస్తే పత్తి మధ్యస్థ రకం రేటును రూ 579 పెంచారు. ఇది ఇప్పుడు రూ 7710 అవుతుంది. పొడవాటి రకం ఇకపై రూ 8110 గా ఖరారు అయింది. దేశంలో ఇటీవలి కాలంలో వరి , జొన్ననే కాకుండా రైతులు విరివిగా పప్పు చమురు ధాన్యాలు వేసేందుకు అవసరం అయిన ప్రోత్సాహకాలను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా పోషకాహార తృణధ్యానాలు , శ్రీ అన్న రకాలను ఎక్కువగా వేసేందుకు అవసరం అయిన రీతిలో మద్దతు ధర కల్పిస్తున్నారని వివరించారు. రైతులకు వారి సాగు వ్యయంతో పోలిస్తే గరిష్టంగా 63 శాతం, కనిష్టంగా 53 శాతం వరకూ మద్దతు ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది ఎంఎస్‌పిల విషయం పరిశీలిస్తే అత్యధికంగా వలిశలు లేదా అడవి నువ్వులకు క్వింటాలుకు పెరిగిన ధర అత్యధికం, కాగా తరువాతి క్రమంలో రాగి, పత్తి, నువ్వులకు ఈ పెరుగుదల వర్తిస్తూ వస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.

రెండు బహుళ లేన్ల రైల్వే ప్రాజెక్టులకు సమ్మతి
కేంద్ర కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సాగే రైల్వేలేన్లు. ప్రయాణికులు, సరుకుల రవాణా వేగవంతం అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. రాట్లమ్ నగ్డా మూడో , నాలుగో లేన్‌ను, వార్థా బలార్షా మధ్య నాలుగో లేన్‌ను రూ 3399 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులు 2029 30 నాటికి పూర్తి అవుతుంది. రైల్వే అవసరాలు అంటే ప్రయాణికుల రద్దీ, సరుకుల రవాణా వంటి కీలక విషయాల నేపథ్యంలో రైల్వేను మల్టీట్రాకింగ్ సిస్టమ్‌లోకి తీసుకువెళ్లడం కీలక లక్షం అని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News