Wednesday, August 20, 2025

యూరియా కొరత.. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు తక్షణమే 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం క్యూలైన్ లో రైతులు బారులు తీరుతున్నారు. ఎండనకా, వాననకా క్యూలైన్ లో గంటల తరబడి నిలబడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి తుమ్మల స్పందిస్తూ.. తెలంగాణకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఎంపీలను కోరారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ ఎంపీల ఆందోళన ఫలించిందని.. గుజరాత్‌, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని కేంద్రం ఆదేశించినట్లు చెప్పారు. 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా తక్షణ కేటాయింపుకు కేంద్రం అంగీకరించిందని.. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News