Thursday, May 1, 2025

హీరోలై గుట్కా ప్రచారమా ?

- Advertisement -
- Advertisement -

అలహాబాద్ : హీరోలుగా చలామణి అవుతోన్న షారూక్ ఖాన్ , అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్‌లకు నోటీసులు వెలువరించారు వీరు పొగాకు ఉత్పత్తుల ప్రచార యాడ్‌లో ఉండటం, తమకున్న క్రేజ్‌తో పరోక్షంగా గుట్కాలు ఇతరత్రా తంబాకు ఉత్పత్తులను ప్రోత్సహించడమే అవుతుందని అందిన ఫిర్యాదులపై స్పందించామని వీరికి నోటీసులు పంపించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బి పాండే అలహాబాద్ హైకోర్టు కు తెలిపారు. నటులు ప్రత్యేకించి పద్మపురస్కారాలు అందుకున్న ప్రముఖులు కూడా యువతను తప్పుదోవ పట్టించే యాడ్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత పిటిషన్లపై తదుపరి విచారణ 2024 మే 9వ తేదీన జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News