Saturday, August 2, 2025

అప్పుడు నాకు చనిపోవాలనిపించింది: చాహల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీతో విడాకులు తీసుకున్నారు. 2020లో ఈ జంట వివాహం చేసుకొని తమ దాంపత్య జీవితానికి ఇప్పుడు ముగింపు పలికారు. ఈ సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడారు. కేరీర్ కీలక సమయంలో ఉన్నప్పుడు భాగస్వామికి సమయం కేటాయించడం కష్టంగా ఉంటుందని, భార్యభర్తలు అర్థం చేసుకోవాలని, వేర్వేరు లక్ష్యాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట ఉన్నప్పుడు మద్దతు ఇచ్చుకోవడం అనేది కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. తాము కెరీర్ లో విజయం సాధించాలని అనుకున్నాం కానీ రిలేషన్ షిప్ కు ప్రాధాన్యం ఇవ్వడం కష్టంగా మారిందని తెలియజేశారు.

దీంతో ఇద్దరు మధ్య భావోద్వేగ సంబంధాలు తెగిపోవడంతో రాజీ పడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ధనశ్రీతో తాను విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది తనని మోసగాడు అన్నారని చాహల్ ఆవేదన వ్యక్తి చేశారు. తాను ఇప్పటివరకు ఎవరినీ మోసం చేయలేదని, చాలా నమ్మకమైన వ్యక్తి అని, నాలాంటి వ్యక్తిని చూడరని పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడారు. కొంత మంది నా విషయంలో జరిగింది తెలియకుండా తనని తప్పుబట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. మహిళలను గౌరవించడం రాదని తనపై విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు.

తన పేరును ఇతరులతో లింక్ చేసి కథనాలు కూడా రాశారని, కేవలం వారి వ్యూస్ కోసమే రాశానని, అవన్నీ తాను పట్టించుకోవడంలేదన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి పలు రకాలు మాట్లాడుకోవడంతో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని, రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని, ఒక్కో సారి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు కూడా వచ్చాయని చాహల్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవిత విషయాలను ఎక్కువగా స్నేహితులతోనే చర్చించానని, ఇంట్లో కుటుంబ సభ్యులకు చెబితే ఆందోళన చెందుతారని వారికి చెప్పేవాడిని కాదన్నారు. తన స్నేహితులు ప్రాతిక్ పవార్, అర్ జె మహ్ వషాతో పాటు ఇతర స్నేహితులతోనే ఎక్కువగా పంచుకునేవాడినని తెలిపారు. వారు ఇచ్చిన మద్దతుతోనే మళ్లీ మామూలు మనిషిగా తయ్యారయ్యానని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News