అమరావతి: పోలవరం- బనకచర్ల పూర్తయితే రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయం అంటే రౌడీయిజం కాదని అన్నారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని కొనియాడారు. నదుల అనుసంధానంతో కరువు ఉండదని, తెలంగాణ నేతలు ఈ విషయాన్ని గ్రహించాలని తెలియజేశారు. వైసిపి విష వృక్షంగా తయారైందని, ఏ మంచి పని చేసినా వైసిపి దానిపై విష ప్రచారం చేస్తుందని విమర్శించారు.
పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకమని, పోలవరం- బనకచర్ల పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరమని, మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని, కొందరు విషవృక్షంలా మారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం లో రప్పా రప్పా రాజకీయం చేయాలనుకున్నారని, పులివెందుల, ఒంటిమిట్టలో ఏం జరిగిందో అందరూ చూశారని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : నన్ను చంపితే డబ్బులు ఎవరు ఇస్తారో పోలీసులే తేల్చాలి: కోటంరెడ్డి