Wednesday, July 16, 2025

పోలీసులను ఎందుకు వేధిస్తున్నారు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు తీరుపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఎపిలో రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగే అధికారులను అవినీతిలో భాగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ అధికారులను వేధిస్తున్నారని మండిపడ్డారు.

తన మాట వినని పోలీస్ అధికారులు సస్పెండ్ చేయడం లేదా విఆర్‌కు పంపించడం జరుగుతుందని జగన్ విమర్శలు గుప్పించారు. డిజి స్థాయి అధికారులతో పాటు సీనియర్ ఐపిఎస్ అధికారులు, సంజయ్, కాంతిరాణా, విశాల్ గున్నీపై తప్పుడు కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. సిద్ధార్థ కౌశాల్ లాంటి యంగ్ అధికారులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పండిందని చురకలంటించారు. తమ ప్రభుత్వంలో పిపుల్ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో పోలీసులు వివక్ష లేకుంగా పని చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎనిమిది డిఎస్‌పిలను సస్పెండ్ చేయడంతో పాటు సిన్సియర్ అధికారులు పోసింట్ ఇవ్వడం లేదని జగన్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News