Friday, July 11, 2025

కాకినాడ మెడికల్‌ కాలేజీ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడ మెడికల్‌ కాలేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఘటనపై బాబు నివేదిక కోరారు. ముఖ్యమంత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కల్యాణ్‌ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కలిసి విద్యార్థినులను వేధించారని సిఎంకు అధికారులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో విద్యార్థినిలను సిబ్బంది లైంగికంగా వేధించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో పని చేసి సిబ్బంది తమతో అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను పర్మినెంట్ ఉద్యోగినని, తనను ఎవరు ఏమీ చేయలని ల్యాబ్ సహాయకుడు విద్యార్థినులను బెదిరించారని, ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని విద్యార్థినిలు కమిటీ ముందు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News