వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)కు ఓదార్పు విజయం దక్కింది. బుధవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సిఎస్‌కె రెండు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది మూడో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రహానె (48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రస్సెల్ 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. మనీశ్ పాండే (36) నాటౌట్ తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ 11 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబె (45) కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరిచాడు.