- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్/చర్లపల్లి:రాష్ట్రంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారు తోం ది. మూడు రోజులుగా భిన్నమైన వాతావర ణంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవగా పలుచోట్ల భా రీగా ఈ దురుగాలులు వీచాయి. ఈ నేపథ్యంలోనే చ ర్లపల్లి రైల్వే టర్మినల్ పైకప్పు రేకులు ఈదురు గాలులకు ఎగిరిపడ్డాయి. సమీపంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతోపాటు పలుచోట్ల చె ట్లకొమ్మలు విరిగిపోయాయి. ఇక, ఆదిలాబా ద్, నిర్మల్, వికారాబాద్, సం గారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లా ల్లో రానున్న రెండు రోజులు గాలులతో కూడి న వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -