లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆఖరి వరకూ ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే. జట్టును గెలిపించేందుకు అతడు సాయశక్తులా పోరాడాడు. కానీ, దురదృష్టం కొద్ది జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా పోరాట పటిమ చూసి కొందరు అతడిని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
జడేజా (Ravindra Jadeja) మరి అంత స్లో ఇన్నింగ్స్ ఆడకుండా ఉండాల్సింది అంటూ అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కామెంట్ చేశారు. కాస్త దూకుడుగా ఆడి ఉంటే ప్రత్యర్థులపై ఒత్తిడి పెరిగేది అని వాళ్లు అభిప్రాయపడ్డారు. ఇలా వచ్చిన విమర్శలకు టీం ఇండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ధీటుగా జవాబిచ్చాడు. జడేజా గొప్పగా బ్యాటింగ్ చేశాడు అని అతను పేర్కొన్నాడు. టెయిల్ ఎండర్లు వికెట్ కాపాడుకొని ఉంటే.. జడేజా నెమ్మదిగా స్కోర్‌ను లక్ష్యానికి చేరువగా తీసుకు వెళ్లేవాడని పుజారా అన్నాడు.
‘‘జడేజా వేగంగా ఆడే అవకాశం లేదు.. పిచ్ స్వభావం అలా ఉంది.. అతను గొప్పగా బ్యాటింగ్ చేశాడు. అలాంటి పిచ్‌పై పరుగు రాబట్టడం కష్టమే. అయితే జడేజా స్ట్రైక్‌డైన్ షాట్లు ఆడి ఉంటే బాగుండేది. అది ఒక్కటే లోపమని చెప్పవచ్చు’’ అని పుజారా అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మూడు టెస్టులు జరగగా.. ఇంగ్లండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ జూలై 23వ తారీఖు నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.