విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన నటించింది. అయితే ఈ సినిమాలో కవి కలశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు వినిత్ కుమార్ సింగ్ నటించారు.
తాజాగా వినిత్ కుమార్ అభిమానులకు శుభవార్తలను వెల్లడించారు. 2021లో ఆయన రుచిరాను వివాహం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని వినిత్ ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన భార్యను ఎలా చూసుకుంటారో వివరించారు. ‘రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. పని వీలైనంత త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్తాను. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తా. వచ్చే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవులు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా’ అని అన్నారు.