- Advertisement -
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ లో బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేలి జవాను మృతి చెందారు. భోపాల్ పట్నం పరిధి ఉల్లూరు అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు లక్ష్యంగా పెట్టిన మందుపాతర పేలి దినేష్ నాగ్ అనే జవాన్ మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
- Advertisement -