Monday, May 12, 2025

టెన్త్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్… చదువులమ్మ తల్లికి బ్లడ్ క్యాన్సర్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: చదువులమ్మ తల్లికి స్టేట్ లో ఫస్ట్ ర్యాంకు.. గత కొన్ని రోజులగా బాలిక బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఇషికా బాలా అనే విద్యార్థిని బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధి రావడంతో చికిత్స తీసుకుంటుంది. క్యాన్సర్‌తో బాధపడుతూ విద్యలో మాత్రం ముందంజలో ఉండేది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ బాలిక పదో తరగతి పరీక్షలు రాసింది. ఛత్తీస్‌గఢ్ సెకండరీ బోర్డు ఎగ్జామ్స్‌లో 99.17 శాతం మార్కులతో ఇషికా స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఐఎఎస్ కవాలనేది తన కల అని తెలిపింది. ఇప్పటికే బాలికకు క్యాన్సర్ చికిత్స నిమిత్తం రూ.15 లక్షలు ఖర్చు చేశామని తల్లిదండ్రులు తెలిపారు. ప్రధానమంత్రి స్వస్థ సహాయ యోజన కింద ఇషికకు సహాయం చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News