Friday, May 2, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు: 16 మంది మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్-ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోలు మృతి చెందారు. ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మావోయిస్టు నేత చలపతిపై రూ.కోటి రివార్డు ఉంది. సోమవారం నుంచి మావోలు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, సిఆర్‌పిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో వెయ్యి మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News