Wednesday, May 14, 2025

రాష్ట్రపతితో ఆర్మీ ఉన్నతాధికారులు భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తోపాటు త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. బుధవారం రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్మును కలిసి, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆర్మీ ఉన్నతాధికారులతో ముర్ము సమావేశమైన ఫోటోలను రాష్ట్రపతి వర్గాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. “డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News