Friday, September 5, 2025

హైదరాబాద్ ఫీవర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు సీజనల్ వ్యాధులతో వణుకుతున్నాయి. నగరంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, ముసురులు, చిన్నపాటి జల్లుల వల్ల గత కొన్ని రోజులుగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి. వంటినొప్పు లు వంటివాటితో ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో రోజురోజుకు బాగా పెరిగుతుందని ఆసుపత్రుల సమాచారం. ఒకరికి ఈ ల క్షణాలు వస్తే, కుటుంబంలో మిగతావారికి కూడా త్వరగానే సోకుతూ వారిని కూడా దవాఖానాల బాటపట్టిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ సీజనల్ వ్యాధులకు ముఖ్య కారణమని వైద్యులు వెల్లడిస్తున్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని వయస్సుల వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒం టినొప్పులతో బాధతో చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానలు, ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మాని యా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.

ఫపీవర్ హాస్పిటల్‌లో 40 50శాతం, ఉస్మానియా ఆసుపత్రిలో2030 శాతం, గాంధీ దవాఖానాలో1520శాతం, బస్తీదవాఖానాలల్లో 4050 శాతం, పిహెచ్‌సి, యుపిహెచ్‌సి, సీపిహెచ్‌సి 3040శాతం రోగుల ఓపి పెరిగిందని డాక్టర్లు తెలిపా రు.గ్రేటర్‌లో చల్లని వాతావరణం వల్ల ఫ్లూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని జీహెచ్‌ఎంసి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో కూడా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి వ్యాధులు సహజమని.. ఈ సంవత్సరం రోగుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సోకుతోన్న జ్వరాలు, సీజనల్ వ్యాధులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన చికిత్సతో త్వరగా ఆరోగ్యంగా తిరిగి యదావిధిగా ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా దవాఖానలతో పాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్‌లో రోగులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణం కంటే 50 శాతం వరకు ఓపీ పెరిగినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానాలో సైతం సీజనల్ వ్యాధుల లక్షణాలతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

ముందుగానే వచ్చేసిన డెంగీ..!
డెంగీతో పాటు చికున్ గున్యా కూడా ప్రభలుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు రోగులు వెల్లడిస్తున్నారు. జ్వర లక్షణాలు కనబడితే డెంగీగా అనుమానించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ జ్వరం ముఖ్యమైన, ప్రాణాంతకమైన వ్యాధి. గ్రేటర్‌లో డెంగీ వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డేంగీ ప్రభావం ముందుగానే కనబడుతోంది. డెంగీ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. డేంగీ అధికంగా శరీర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. డెంగీ బారిన పడినవారికి తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. డెంగీ బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడిస్తోంది. 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మిగతా ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. వీరిలో వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందనేది వైద్యుల అభిప్రాయంగా ఉంది.

పెరిగిన చికున్ గున్యా రోగులు…
ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కు రోగులు చికిత్సల నిమిత్తం పరుగులు తీస్తుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి . గతంలో వారానికి కేవలం పదుల సంఖ్యలో నమోదయ్యే కేసులు తాజాగా ప్రతి హాస్పిటల్ లో నిత్యం పదుల సంఖ్యలో నమోదౌతున్నట్టు సమాచారం. గ్రేటర్‌లో చాలా ప్రైవేట్ , కార్పొరేట్ హాస్పిటల్స్ లో పడకల కొరత ఏర్పడుతోందంటే పరిస్థితి విదితమవుతోంది. వీటిల్లో వైద్యం ఆర్ధికంగా భారమైనప్పటికీ రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపే చికిత్స నిమిత్తం వెళ్తున్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో చికున్ గున్యా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇది ‘టోగావిరిడే’ కుటుంబానికి చెందిన ‘ఆల్ఫా వైరస్’తో అరుదైన విష జ్వరము సోకుతుంది. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనే రకము దోమ కాటుతో జ్వరం వ్యాపిస్తుందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు . ఈ వ్యాధి వచ్చిన రోగులు కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందలు పడుతుంటారు. ఈ జ్వరం వచ్చిన వారు నిటారుగా నిలిచి నడవలేక వంగి గూనిగా నడుస్తారు . చికున్ గున్యా వ్యాధి ప్రాణాంతకము కానప్పటికీ శరీరం భరించలేని నొప్పులతో భాదిస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News