Tuesday, September 2, 2025

పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల సమీపంలో ఉండే వలస కూలీల పిల్లలను కిడ్నాప్ చేసి పిల్లలు లేని వారికి విక్రయిస్తున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురు పిల్లలను రక్షించారు. నిందితుల వద్ద నుంచి రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి వినిత్ గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంఘారెడ్డి జిల్లా, పటాన్‌చెరువుకు చెందిన చిలుకూరి రాజు ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాక్టిషనర్‌గా పనిచేస్తున్నాడు, మహ్మద్ ఆసిఫ్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు, మెదక్ జిల్లా, సిద్ధిపేటకు చెందిన రిజ్వానా బిఎఎంఎస్ పూర్తి చేసి క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తోంది. హైదరాబాద్, మూసాపేట్‌కు చెందిన నర్సింహారెడ్డి తాపిమేస్త్రీగా పనిచేస్తున్నాడు, పటాన్‌చెరువుకు చెందిన బాలరాజు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఐదుగురు కలిసి పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఐదేళ్ల నుంచి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులను అందరు కలిసి పంచుకుంటున్నారు.

రాజు పిల్లలను కిడ్నాప్ చేసి ఆసిఫ్‌కు ఇవ్వగా, అతడు రిజ్వానాకు అప్పగిస్తాడు. ఆమె పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలను విక్రయిస్తోంది. నిందితురాలు సంఘారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, మెదక్‌లో విక్రయించింది. ఈ క్రమంలోనే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి, పోచమ్మటెంపుల్ సమీపంలో ఉంటున్న పోచమ్మ భర్త, నలుగురు కుమారులతో కలిసి ఉంటోంది. గత నెల 26వ తేదీన చిన్న కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ఇంటి ఎదుట రెండో కుమారుడు అఖిల్(5) ఆడుకుంటున్నాడు. బాలుడిని చూసిన రాజు బిస్కెట్లు, చాక్లెట్లు చూపించి దగ్గరికి తీసుకుని బైక్‌పై కిడ్నాప్ చేసి పారిపోయాడు. తర్వాత సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లికి చెందిన దంపతులకు పిల్లలు లేకపోవడంతో రూ.7లక్షలకు విక్రయించారు. ఆస్పత్రికి నుంచి ఇంటికి వచ్చిన పోచమ్మ రెండో కుమారుడు అఖిల్ కన్పించకపోవడంతో చాందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఐదేళ్ల నుంచి దందా….
నిందితులు ఐదేళ్ల నుంచి పిల్లలను కిడ్నాప్ చేసి సంతానం కలుగని తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు. రాజు నాలుగేళ్ల క్రితం కాచీగూడ రైల్వే స్టేషన్‌లో నాలుగేళ్ల క్రితం బాలికను కిడ్నాప్ చేసి రూ.42,000 విక్రయించాడు. అప్పటి నుంచి పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నాడు, వచ్చిన డబ్బులను అందరు కలిసి పంచుకుంటున్నారు. నిందితుల బారి నుంచి అఖిల్(5), అరుణ్(2), అమ్ములు(8 నెలలు), లాస్య(5), అద్విక్(2), ప్రియా(1)ను కాపాడు. ఇందులో అఖిల్, అరుణ్, అద్విక్, ప్రియా తల్లిదండ్రులను గుర్తించగా, లాస్య, అమ్ముల తల్లిదండ్రులను గుర్తించాల్సి ఉంది. నిందితుల్లో ఉన్న బాలారాజు తన పిల్లలు అదిక్, ప్రియాను పుట్టగానే పిల్లలు లేని వారికి రూ.4.5లక్షలకు విక్రయించాడు. అమ్ములును రూ.3.5లక్షలకు విక్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News