న్యూఢిల్లీ: అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వం ‘స్మార్ట్ ఫోన్’. అదే ఫోన్ పిల్లల పాలిట శాపంగా మారింది. బంగారు భవిష్యత్తును స్మార్ట్ ఫోన్ల ఛిద్రం చేస్తున్నాయి. పబ్జీ గేమ్ ఉచ్చులో పడి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్‌లైన్‌లో నేర్చుకుంటారని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెల్‌లను చేతికిస్తే… భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడుతున్నారు. పదేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తున్న బాలబాలికలు సగం మంది యుక్తవయసుకు వచ్చేసరికి వివిధ రకాల మానసిక రుగ్మతలో బాధపడుతున్నారు. విద్యార్థుల ఏకాగ్రతను, చదువును, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది.
బాలుడు ఆన్‌లైన్ గేమ్స్ ఏడు గంటలు పాటు ఆడి, య్యూట్యూబ్‌లో మూడు గంటలు పాటు వీడియోలను వీక్షించి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని అంబిక విహార్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగ్లోయ్ లోని ఎంసిడి రన్ స్కూల్‌లో పదేళ్ల బాలుడు చదువుతున్నాడు. జులై 31న భారీ వర్షం కురవడంతో ఇంటికి వద్దనే ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్లారు. బాలుడు ఇంటి పది గంటలు ఫోన్‌తోనే గడిపాడు. ఏడు గంటలు పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడాడు. అనంతరం మూడు గంటల పాటు యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించాడు. అనంతరం ఫ్యాన్ రాడ్డుకు ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్ వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల తిట్టడం వల్ల కలిగే మానసిక క్షోభ, విద్యా ఒత్తిడి, గేమింగ్‌కు సంబంధించిన నిరాశ వంటి ఇతర కారణాలతోనే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై ఎక్కడా గాయాలు లేవని వెల్లడించారు.