లక్నో: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పురటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి హెయిర్ క్లిప్పు, చిన్న కత్తి సాయంతో ఓ వైద్యుడు సుఖ ప్రసవం చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ పన్వేల్ నుంచి గోరఖ్ పూర్ కు వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో అత్యసవరం వైద్య సాయం కోసం ఝాన్సీని స్టేషన్‌లో దించారు. అదే సమయంలో ఆర్మీ వైద్యాధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా(31) హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాట్‌ఫామ్ వేచి చూస్తున్నాడు. గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్లాడు. హెయిర్ క్లిప్పు, చిన్న కత్తి సాయంతో సుఖ ప్రసవం చేశాడు. తల్లి పండంటి ఆడపిల్లకు జన్మించింది. బొడ్డు తాడును బిగించడానికి చిన్న హెయిర్ క్లిప్పు వాడానని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని నిర్దారించుకున్న తరువాత బొడ్డు తాడును కత్తితో కత్తిరించానని వివరణ ఇచ్చాడు. తల్లి, బిడ్డను బ్రతికించిన డాక్టర్ దేవుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చిన్న కత్తి, హెయిర్ క్లిప్పుతో రైల్వే ప్లాట్ ఫాంపై ప్రసవం… ది గ్రేట్ డాక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -