Monday, June 9, 2025

కలల పిల్లలు“`

- Advertisement -
- Advertisement -

ఈ లోకం నచ్చకనో, చాలకనో
కొందరు కవులవుతారు
కలలలోకీ, కళలలోకీ జారతారు
మామూలు మానవ లోకానికేమి
అన్నింటినీ కలుషితం చేస్తుంది
జ్ఞానాన్ని, భక్తిని, కళని, కరుణనీ
కొందరు పసివాళ్ళుంటారు
ఎదగటం ఇష్టం లేనివారు
ఎదగటంలో ఏమీ లేదని
పసితనంలోనే పసిగట్టినవాళ్ళు
వాళ్ళకి రంగురంగుల బొమ్మలిష్టం
రంగురంగుల ఆటలిష్టం
శబ్దాలిష్టం, పదాలిష్టం
రంగుల్లోకి దుమికే, ఈదే
ఊహలిష్టం, కళలు ఇష్టం
లోకం వల్ల వాళ్లకెంత
దుఃఖమో చెప్పలేరు ఎంత రాపిడో
భయమో చెప్పుకోలేరు
వాళ్ళు తడుముకుంటారు
పీడకలలోని బిడ్డ అమ్మ కోసం
తడుముకున్నట్టు
కరుణనీ, కళనీ, భక్తినీ, జ్ఞానాన్నీ
వాళ్ళెవరినీ చేరరు, చేరనివ్వరు
లోకమంటుంది కదా వాళ్లకెంత గర్వం
ఎంత ధిక్కారం, ఎంత నిరంకుశత్వం
పాపం, వాళ్ళకవేమీ తెలీదు
పసితనంలోంచి బయటికి రావటానికి
జంకే వాళ్ళ నైర్మల్యం గురించి
లోకానికి కూడా, పాపం ఏమీ తెలీదు
బివివి ప్రసాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News