Saturday, August 30, 2025

చీమకుర్తిలో సూర్య గ్రానైట్ క్వారీలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని సూర్య గ్రానైట్ క్వారీలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో డంపర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో చీమకుర్తి జవహర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు డంపర్ డ్రైవర్ క్రిస్టిపాడు రంగయ్య, సూపర్ వైజర్ నాలుగు సాయి రెడ్డిగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. క్వారీలోనీ వెస్ట్ తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సూర్య గ్రానైట్ క్వారీ యజమాని వైెఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఎ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News