Saturday, July 26, 2025

సింధుకు హుడా షాక్

- Advertisement -
- Advertisement -

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

చాంగ్‌జౌ: చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ ఉన్నతి హుడా పెను సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి ఉత్కంఠ పోరులో స్టార్ షట్లర్ పి.వి.సింధును మట్టికరిపించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో హుడా 2116, 1921, 2113తో సింధును ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో హుడా దూకుడును ప్రదర్శించింది. సింధు జోరు ను తట్టుకుంటూ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

రెండో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. ఇటు సింధు అటు ఉన్నతి ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సింధు జయకేతనం ఎగుర వేసిం ది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. అయితే ఆఖరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన ఉన్నతి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో ప్రణయ్ తైవాన్ షట్లర్ చౌ చేతిలో పోరాడి ఓడాడు.

సాత్విక్ జోడీ ముందుకు..

మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్‌కుచేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ 2119, 2119తో ఇండోనేషియాకు చెందిన లియో రాలీబగాస్ మౌలానా జంటను ఓడించింది. చివరి వరకు ఆధిక్యా న్ని కాపాడుకోవడంలో సఫలమైన సాత్విక్ జోడీ వరుసగా రెండు సెట్లను గెలిచి క్వార్ట ర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News