- Advertisement -
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే, సమస్యను పరిష్కరించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు చైనా సిద్ధమేనని పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ప్రధాన ఉగ్రస్థావరాలను లక్ష్యంగా దాడులు చేశారు. ఇందులో భారీగా ఉగ్రవాదులు మరణించారు. దీంతో పాక్.. భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు తెగబడుతోంది. పాక్ దాడులను భారత సైన్యం సమర్దవంతంగా తిప్పికొడుతోంది.
- Advertisement -