Sunday, August 10, 2025

నాపై కుట్ర ఆరోపణలు కాదు… నేరుగా బిజెపిని ఎదుర్కోండి

- Advertisement -
- Advertisement -

Chirag flag slams Bihar CM Nitish

బీహార్ సిఎం నితీష్‌పై చిరాగ్ ధ్వజం

పాట్నా: ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రజాదరణకు గండి కొట్టేందుకు జరిగిన కుట్రలో తన ప్రమేయం ఉందని ఆరోపించడానికి బదులు బీజేపీతో తేల్చుకోవాలని లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ ) అధ్యక్షుడు చిరాగ్ సవాల్ విసిరారు. సోమవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకంటే స్వంత మనుషుల నుంచే నితీష్ ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో శరద్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్‌లను తాజాగా జెడి (యు) మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సిపి సింగ్‌ను నితీష్‌కుమార్ అవమానించారని ఆరోపించారు. సొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు అవినీతికి పాల్పడినట్టు గతంలో ఎన్నడూ వినలేదని, కానీ నితీష్ మాత్రం మీరు (ఆర్సీపీ సింగ్) అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. జేడీయూ చీలిపోయిన పార్టీ అని, ఆర్సీపీ సింగ్ వైదొలిగేలా చేశారని, కానీ నితీష్ కుమార్‌వంటివారికి లలన్, ఉపేంద్ర కుశ్వాహా వంటి వారు అవసరం అని చిరాగ్ ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News