Tuesday, July 1, 2025

పవన్ కల్యాణ్ సెట్స్ కు చిరు… ఆనందంలో మెగాభిమానులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా రాక్‌స్టార్ దేశి శ్రీ సంగీతం అందిస్తున్నారు. పవన్‌కు జోడిగా శ్రీలీల నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తరువాత పవన్, హరీష్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ తీయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా మెగస్టార్ చిరంజీవి ప్రత్యక్షకావడంతో సినిమా యూనిట్ ఆశ్చర్యపోయింది. పవన్‌తో చిరంజీవి దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక సినిమా తీయాలని మెగా అభిమానులు కోరుతున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య, గౌతమి, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, మహేష్, టెంపర్ వంశీ, అశుతోష్ రానా ప్రముఖ నటినటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 2025 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News