- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి విచ్చేసిన చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇరువురూ కొంత సేపు వివిధ అంశాలపై చర్చించారు. మర్యాద పూర్వకంగా కలిసారే తప్ప రాజకీయ అంశాలేవీ చర్చించలేదని తెలిసింది.
- Advertisement -