Friday, September 5, 2025

స్కూల్‌కు తీసుకెళ్తానని చెప్పి ఆరో తరగతి బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కూల్ దగ్గర వదిలిపెడుతానని చెప్పి బాలికను బైక్‌పై తీసుకెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామంలో ఆరో తరగతి బాలిక స్కూలుకు వెళ్తుండగా ప్రసాద్(40) అనే వ్యక్తి ఆమెను తన బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్తానని చెప్పాడు. బాలిక అమాయకంగా అతడి బైక్‌పై వెళ్లింది. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అతడు అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఎరువు..దరువు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News