Friday, July 25, 2025

కాలేజీలో ల్యాబ్ టెక్సీషియన్ తో పారిపోయిన విద్యార్థి… వయసు తెలిస్తే షాక్ అవుతారు?

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌తో (38) విద్యార్థి(19) బెంగళూరుకు పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 19 ఏల్ల యువకుడు ఓ కాలేజీ బిటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఓ 38 ఏళ్ల మహిళ ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇద్దరు పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. ఆమె తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. మే 24న యువకుడు ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నానని చెప్పి బెంగళూరు వెళ్లిపోయారు. చాలా రోజుల నుంచి కుమారుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. ఓ మహిళతో పారిపోయినట్టు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని చిత్తూరుకు పట్టుకొచ్చారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత వారిని వేర్వేరుగా ఇళ్లకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News