రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి (38) మృతి చెందాడు. బెడ్రూమ్‌లోని ఏసీ నుంచి మంటలు చెలరేగి గది అంతా దట్టంగా పొగ అలుముకోవడంతో ఊపిరి ఆడక అతడు మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వీరేందర్ రెడ్డి పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పని చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న వయస్సులోనే ఇలా అర్ధాంతరంగా మరణించడంతో వీరేం దర్ రెడ్డి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వీరేందర్ రెడ్డి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరేందర్ రెడ్డి మరణా నికి అగ్ని ప్రమాదామేనా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.