Tuesday, September 16, 2025

ఇంగ్లండ్‌కు షాక్.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

లండన్: కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ర‌ను 224 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌‌లో బ్యాటింగ్‌లోనూ అదరగొడుతుంది. అయితే అన్ని విభాగాల్లో రాణిస్తున్న ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో వోక్స్ (Chris Woakes) ఎడమ భుజానికి గాయమైంది. మిడ్-ఆఫ్ మీదుగా వెళ్తున్న బంతిని అడ్డుకొనేందుకు వోక్స్ డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను గాయపడ్డ అతన్ని మైదానం వీడి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికి వైద్యం జరుగుతోందద. అతను ఆరోగ్యంగా లేని కారణంగా ఈ మ్యాచ్ నుంచి అతన్ని తప్పిస్తున్నట్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

ఇక తొలి ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తొలి వికెట్‌కి బెన్ డకెట్, జాక్ క్రాలీలు కలిసి 92 పరుగులు జోడించారు. అయితే ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో డకెట్ (43) ఔట్ అయ్యాడు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 109 పరుగులు చేసి.. 115 పరుగులు వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News