Saturday, August 23, 2025

చుపా చుప్స్ కొత్త కాంపైన్ ‘సంఝ్ కే బాహర్’ విడుదల

- Advertisement -
- Advertisement -

పర్ఫెట్టి వాన్ మెల్లీ వేదిక నుండి దిగ్గజపు, ఉల్లాసకరమైన కన్ఫెక్షనరి బ్రాండ్స్ లో ఒకటి చుపా చుప్స్, తమ సిగ్నేచర్ తియ్యని & పుల్లని రుచి యొక్క విచిత్రమైన ప్రభావాన్ని సజీవంగా తెచ్చిన సరికొత్త కాంపైన్ ను విడుదల చేసింది. పునరుత్తేజం కలిగించే కొత్త TVCతో, తీపి, పులుపుల కలయిక సాధారణ జీవితాన్ని ఏ విధంగా పూర్తిగా వినోదంగా మార్చగలదు అని ఆలోచనతో ఈ కాంపైన్ రూపొందించబడింది. రోజూవారీ క్షణాల్లో వినోదం కలిగించే బ్రాండ్ ఉద్దేశ్యంతో రూపొందించబడిన కాంపైన్ చుపా చుప్స్ స్వీట్ & సోర్ (తియ్యని & పుల్లని) జెల్లీలు ఊహ మరియు ఆలోచన యొక్క ఉల్లాసకరమైన ప్రభావాన్ని ఏ విధంగా కలిగిస్తాయో ప్రదర్శించడం ద్వారా ఈ కాంపైన్ ఒక ఉత్సాహవంతమైన మలుపు తిరుగుతుంది. సాధారణమైన రుచితో, ఈ ఫిల్మ్ తీపి, పులుపు కలిసినప్పుడు అనూహ్యమైన విషయాల వైపు మళ్లుతుంది, మరియు ఆలోచన పూర్తిగా అదృశ్యమవుతుంది.

కొంతమంది స్నేహితుల సమూహం క్యారమ్స్ ఆడుతున్న సాధారణ సెట్టింగ్ లో TVC ప్రారంభమైంది. అయితే వారు చుపా చుప్స్ బెల్ట్స్ ను కొరకడం ప్రారంభించిన క్షణమే, ఈ ప్రసిద్ధి చెందిన ఆట ఊహించలేనంత ఉల్లాసకరంగా మారిపోయింది. ఇదంతా కాంపైన్ యొక్క ప్రధానమైన ఆలోచన “సమఝ్ కే బాహర్ హై, జైసే చుపా చుప్స్ sweet హై యా sour హై (చుపా చుప్స్ స్వీట్ లేదా సోర్ వలే, ఇది ఆలోచించడానికి మించినది.)” ని చూపించే క్షణంగా మారిపోయింది.

కాంపైన్ గురించి మాట్లాడుతూ, గుంజన్ ఖేతన్, డైరెక్టర్ మార్కెటింగ్, పర్ఫెట్టి వాన్ మిల్లే ఇండియా, ఇలా అన్నారు, “చుపా చుప్స్ కోసం, ‘ ఫర్ ఎవ్వర్ ఫన్‘ మా ప్రధానమైన సిద్ధాంతంగా ఉంది. ఈ కాంపైన్ తో, మేము ఆ చర్యను సాధారణమైన రుచి క్షణాన్ని స్వచ్ఛమైన, ఊహించలేని వినోదాత్మకమైన అనుభవంగా మార్చాలని కోరుకుంటున్నాము. మా బెల్ట్స్ లోని స్వీట్-అండ్-సోర్ కలయిక కేవలం రుచి గురించి మాత్రమే కాకుండా, అది ప్రతి బైట్ లో ఆనందం, నవ్వు, ఎంతో ఊహించలేని వినోదానికి సంబంధించినది. మరియు ఇతివృత్తం “సమఝ్ కే బహార్ హై, జైసే చుపా చుప్స్ స్వీట్ హై యా సోర్ హై (చుపా చుప్స్ స్వీట్ లేదా సోర్ వలే, ఇది ఆలోచించడానికి మించినది.) దీనిని అందంగా కాప్చర్ చేసింది. వ్యక్తీకరణ, ఊహించలేనితనం, మరియు ఫిల్టర్స్ లేకుండా వినోదానికి విలువనిచ్చే తరం ఎంచుకునే బ్రాండ్ గా చుపా చుప్స్ ను రూపొందించడానికి మా యొక్క కలను ఇది చూపిస్తోంది. కొన్నిసార్లు ఆలోచన యొక్క నియమాలను ఉల్లంఘించడం ఖచ్చితంగా క్షణాలను జ్ఞాపకంగా మారుస్తాయని ఈ ఫిల్మ్ గుర్తు చేస్తుంది.”

ఒగ్లీవి ద్వారా ఈ కాంపైన్ భావన రూపొందించబడింది. ఈ కాంపైన్ కల్పిత కథను చెప్పడం, సాధారణ రోజూవారీ సాంస్కృతిక సంకేతాలు, మరియు బ్రాండ్ యొక్క అగౌరవమైన స్ఫూర్తిని చూపించే స్పష్టమైన అల్లరి భావనను ఒక చోట చేర్చింది.

కాంపైన్ గురించి మాట్లాడుతూ, అనురాగ్ అగ్నిహోత్రి, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, వెస్ట్ ఇలా అన్నారు, “చుపా చుప్స్ తో సాధారణ క్షణాలను కూడా వినోదం నిండిన క్షణాలుగా ఏ విధంగా మార్చవచ్చో ఈ ఫిల్మ్ చూపించింది. అమాయకపు క్యారమ్స్ మ్యాచ్ వివిధ స్టైల్స్ ను సృష్టించడం, నియమాలను ఉల్లంఘించిన వినోదం, మరియు గందరగోళాల అల్లరిగా మారిపోయిన ప్రపంచాన్ని మేము ఊహించాము. చుపా చుప్స్ బెల్ట్స్ యొక్క రుచి అనుభవానికి మేము ప్రాధాన్యతనిచ్చాము – ఎందుకంటే తియ్యని, పుల్లని కలయిక ఉన్నప్పుడు, వినోదం తప్పనిసరిగా ఉంటుంది. అందులోనే మేజిక్ ఉంది.”

ఈ కాంపైన్ టెలివిజన్, డిజిటల్ ప్లాట్ ఫాంస్, మరియు సోషల్ మీడియాలలో ప్రారంభమైంది. బ్రాండ్ యొక్క విలక్షణమైన రుచిని ప్రధానాంశంగా తెలియచేయడం ద్వారా కొత్త వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా ఆకస్మిక వినోదానికి మూలంగా దాని విలక్షణమైన గుర్తింపును శక్తివంతం చేయడమే దీని లక్ష్యం. “సమఝ్ కే బహార్ హై, జైసే చుపా చుప్స్ sweet హై యా sour హై (చుపా చుప్స్ స్వీట్ లేదా సోర్ వలే, ఇది ఆలోచించడానికి మించినది.) తో చుపా చుప్స్ కేవలం సాహసోపేతమైన రుచిని మాత్రమే కాకుండా, సాహసోపేతమైన వినోదాన్ని కూడా ప్రతి బైట్ లో ఎంపిక చేసుకునే వారి కోసం బ్రాండ్ గా తమ స్థానాన్ని శక్తివంతం చేస్తూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News