హైదరాబాద్: గత ఐపిఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో హెచ్‌సిఎ ప్రెసిడెంట్ (HCA President) జగన్‌మెహన్ రావును తెలంగాణ సిఐడి అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపిఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఐపిఎల్ సీజన్ సమయంలో హెచ్‌సిఎ ప్రెసిడెంట్ (HCA President) హోదాలో ఎస్‌ఆర్‌హెచ్‌ని ఫ్రాంచైజీ జగన్‌మోహన్ రావు బెదిరించారనేది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమని విజిలెన్స్ నిర్ధారించడంతో సిఐడి ఇప్పుడు అరెస్ట్ చేసింది. హెచ్‌సిఎకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఫీగా ఇస్తుంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫీగా ఇవ్వాలని లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వమని జగన్‌మోహన్ రావు డిమాండ్ చేశారు. అయితే రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచిస్తామని ఎస్‌ఆర్‌హెచ్ తెలిపింది.
అంతేకాక తనకు వ్యక్తిగతంగా 10 శాతం విఐపి టికెట్లు ఇవ్వాలని కూడా జగన్‌మోహన్ బెదిరింపులకు దిగారు. దానికి ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించకపోవడంతో లక్నోతో జరిగే మ్యాచ్ సందర్భంలో విఐపి కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు వేయించారు. దీంతో షాక్ అయిన ఎస్‌ఆర్‌హెచ్ హైదరాబాద్ వదళి వెళ్లిపోతామని హెచ్చరించింది. దీంతో ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సిఎ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సిఐడి అక్రమాలు వాస్తవమని తేలడంతో ఇప్పుడు అరెస్ట్ చేసింది.