Saturday, July 5, 2025

ప్రతి సాంగ్ చాలా స్పెషల్

- Advertisement -
- Advertisement -

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. (Junior)వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ ఇటీవల ప్రకటించిన ప్రకారం ఈ సినిమా జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ ను విడుదల చేశారు. జీవితం, ప్రేమ, సంగీతం – అన్నింటినీ కలిపే ఫీలింగ్ తో, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను మరింత రిచ్‌గా కంపోజ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ “డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాని చాలా ప్రత్యేకంగా తీశారు. స్క్రిప్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇందులో ఎనర్జిటిక్‌గా ఈ సాంగ్ ఉంది”అని అన్నారు. హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ “లెజెండరీ యాక్టర్ వి.రవిచంద్రన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేశాను. చాలా మంచి సినిమా తీశాం. దేవిశ్రీ నెక్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ “ఇందులో ప్రతి సాంగు చాలా స్పెషల్. మరిన్ని అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. దేవిశ్రీప్రసాద్, సెంథిల్… ఇలా బెస్ట్ టీంతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ వి.రవిచంద్రన్, డిఓపి సెంథిల్ కుమార్, కొరియోగ్రఫర్ విజయ్ పోలకీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News