- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు కార్యకలాపాలు నిలిపివేయడంతో పాటు కోర్టును మూసివేసి తనిఖీలకు చీఫ్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను పోలీసులు బయటకు పంపిస్తున్నారు. సిటీ సివిల్ కోర్టుతో పాటు 4 చోట్ల బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్ వచ్చింది. నాలుగు చోట్ల పోలీసులు, బాంబ్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ తనిఖీలు చేస్తున్నారు. అబీదా అబ్దుల్లా పేరుతో దుండగుడు మెయిల్ పంపాడు. తాజాగా రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది.
- Advertisement -